Vikarabad Tragedy: సూసైడ్ నోట్ వెలుగులోకి.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Vikarabad Tragedy
x

Vikarabad Tragedy: సూసైడ్ నోట్ వెలుగులోకి.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Highlights

వికారాబాద్‌లో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలిలో లేఖ లభించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Vikarabad జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని గంగారాం సాయిబాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, దివ్య గత ఐదేళ్లుగా ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతదేహం వద్ద లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన నిర్ణయానికి ఎవరూ కారణం కారని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను క్షమించాలని కోరుతూ భావోద్వేగపూరితంగా సందేశం రాసినట్లు పేర్కొన్నారు.



ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories