Hyderabad: అల్వాల్‌ పీఎస్‌ పరిధి లోతుకుంటలో భార్య ధర్నా

Hyderabad: *భర్త ఇంటి ఎదుట వారం రోజులుగా ధర్నా చేస్తున్న శ్రీలత *తల్లి, అక్కతో కలిసి భర్త ఇంటి ఎదుట వంటా వార్పు

Sandeep Eggoju
Updated on: 28 Dec 2021 3:04 PM IST
Wife dharna in front of husbands house in Hyderabad | TS News Today
X

అల్వాల్‌ పీఎస్‌ పరిధి లోతుకుంటలో భార్య ధర్నా

Hyderabad: అల్వాల్‌ పీఎస్‌ పరిధి లోతుకుంటలో భర్త ఇంటి ఎదుట వారం రోజులుగా భార్య ధర్నా చేస్తోంది. అత్తింటి వారు తనను ఇంట్లోకి రానివ్వడంలేదని, ఇంటికి తాళం వేసుకొని ఎక్కడికో వెళ్లిపోయారని భార్య శ్రీలత ఆరోపిస్తోంది. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తిరిగి రాలేదని చెబుతోంది. తన తల్లి, అక్కతో కలిసి భర్త ఇంటి ఎదుటే వంట చేసుకుంటూ గడుపుతోంది. తనకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోనని అంటోంది. ఇక రక్షణ కోసం కోరగా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు శ్రీలత.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story