Nagarkurnool: దారుణం..దైవదర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం

Nagarkurnool: దారుణం..దైవదర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం
x
Highlights

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో దారుణం జరిగింది. దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సాముహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది....

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో దారుణం జరిగింది. దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై సాముహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఊర్కొండపేట ఆంజయనేయస్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి శనివారం వచ్చారు. దైవదర్శనం తర్వాత రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

యువతి కాలక్రుత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా అక్కడ మాటేవేసి ఉన్న యువకులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేశారు. యువతిని బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులును ఉర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా గాలిస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories