Nirmal: రేవోజిపేట రైతు వేదికలో వైభవంగా విత్తన మేళా ప్రారంభం

Nirmal: ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచేందుకు నిర్మల్ జిల్లా రేవోజిపేట రైతు వేదికలో మూడు రోజుల విత్తన మేళా ప్రారంభమైంది.

RAKESH N, KHANAPUR
Published on: 27 July 2026 11:46 AM IST
Nirmal
X

Nirmal: రేవోజిపేట రైతు వేదికలో వైభవంగా విత్తన మేళా ప్రారంభం

ఆదిలాబాద్: ఎల్నినో కారణంగా వరి సాగు తగ్గించి, ప్రత్యమ్నాయ పంటల పై అవగాహన కల్పిస్తూ, రైతు వేదిక ల్లో విత్తనాల విక్రయం నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

నిర్మల్ జిల్లా// దస్తురాబాద్ మండలం రేవోజిపేట రైతు వేదికలో MAO మానస, AEO కిరణ్, సర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమం ప్రారంభమైంది.

తక్కువ నీటి వినియోగం తో పండే పప్పు దినుసులు , నూనె గింజలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా మరియు నానో DAP వాడకం, వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు.

ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ కాల పరిమితి తో చేతికొచ్చే, ప్రభుత్వం బోనస్ ఇచ్చే 7 రకాల వరి విత్తనాలు మాత్రమే రైతులు పండించాలని సూచించారు.

మార్కెట్‌లో నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల నుంచే విత్తనాలు సేకరించాలని, కొనుగోలు రసీదులను భద్రపరుచుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.....

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story