Nirmal: భూమి రాసివ్వగానే నడిరోడ్డుపై నెట్టేశారు.. భైంసాలో వృద్ధుల ఆవేదన!

Nirmal: భైంసా మండలం సిద్ధూరులో హృదయ విదారక ఘటన. కొడుకులకు 7 ఎకరాల భూమి రాసిచ్చిన వృద్ధ దంపతులను ఇంట్లోంచి గెంటేయడంతో సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 10 Oct 2026 4:40 PM IST
Nirmal
X

Nirmal: భూమి రాసివ్వగానే నడిరోడ్డుపై నెట్టేశారు.. భైంసాలో వృద్ధుల ఆవేదన!

Nirmal: సిద్దూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చిన్నబాయి, కొమురయ్య తమకున్న తొమ్మిది ఎకరాల భూమిఉంది అందులో రెండు ఎకరాలు తాము ఉంచుకొని మిగితా ఏడు ఎకరాళి కొడుకుల పేరున రాసిచ్చారు. భవిష్యత్తులో కొడుకులు తమను బాగా చూసుకుంటారని నమ్మారు. కానీ భూమి పేరున పడగానే వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

కొడులకు రాసిచ్చిన స్థలం లో ఇల్లు కట్టుకోగ అందులో కోడలు ఉండనివ్వడం లేదని, కనీసం అన్నం కూడా పెట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక న్యాయం కోసం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేసి, తమ భూమిలో తమకు బతుకుదెరువు కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa