Nirmal: దస్తురాబాద్‌లో అదనపు పీడీ నాగవర్ధన్ ఆకస్మిక తనిఖీ!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో అదనపు పీడీ, డిప్యుటీ సీఈఓ నాగవర్ధన్ విస్తృతంగా పర్యటించారు.

RAKESH N, KHANAPUR
Published on: 26 July 2026 5:41 PM IST
Nirma
X

Nirmal: దస్తురాబాద్‌లో అదనపు పీడీ నాగవర్ధన్ ఆకస్మిక తనిఖీ!

నిర్మల్: దస్తరబాద్ మండల పరిధిలోని అకొండపేట, గోడిసైర్యాల, రేవోజీపేట గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న వివో (VO) భవన నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం ఆయన రైతులతో మరియు స్థానికులతో మాట్లాడారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా, రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అదేవిధంగా భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.

ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు నిర్మించుకోవాలని, వర్షపు నీటిని వృథా పోనివ్వకుండా సంరక్షించుకోవాలని నాగవర్ధన్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో, ప్రజాప్రతినిధులు సర్పంచులు పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story