Adilabad: ఆదిలాబాద్‌లో ముగిసిన ఈత పోటీలు!

Adilabad: ఆదిలాబాద్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ జూనియర్, సబ్ జూనియర్ పోటీలు. గచ్చిబౌలి రాష్ట్రస్థాయి పోటీలకు విజేతలు ఎంపిక.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 13 July 2026 10:37 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ముగిసిన ఈత పోటీలు!

Adilabad: ఆదిలాబాద్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ జూనియర్ సబ్ జూనియర్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. స్థానిక ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన పోటీలలో క్రీడాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణ కుమార్, ఆదిత్య ఖండేష్కర్, కోచ్ లు శ్రీనివాస్ గౌడ్, చంద్రకాంత్ పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథులు పతకాలు అందించి అభినందించారు.

విజేతలు ఈనెల 18, 19 తేదీలలో గచ్చిబౌలిలోని స్విమ్మింగ్ పూల్ లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షులు సాయిని రవికుమార్ తెలిపారు. జిల్లాలో స్విమ్మింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజేతలకు అభినందనలు తెలిపిన ఆయన.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story