Adilabad: ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు – కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపణ.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 22 Aug 2026 3:59 PM IST
Adilabad
X

Adilabad: ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు – కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపించారు.

శనివారం పట్టణంలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా నాల్గవ మహాసభలు ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సంఘం జెండా ఆవిష్కరించారు.

జిల్లాకు యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రానున్న రోజులలో విద్యార్థి లోకాన్ని ఏకధాటిపై తీసుకువచ్చి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవ్, నాయకులు తబ్రేజ్, భాస్కర్, రాజు తదితరులున్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story