Adilabad: కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్థుల ధర్నా

Adilabad: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు భూసేకరణతో నష్టపోతున్న అనుకుంట గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఎకరాకు రూ. 6 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 5 Aug 2026 2:46 PM IST
Adilabad
X

Adilabad: కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్థుల ధర్నా

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అనుకుంట గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి, 90 శాతం పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డును సేకరిస్తే ఊరిని కూడా ఖాళీ చేయించాలని, భూములకు మార్కెట్ ధరకు మూడింతల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్పష్టమైన హామీ కోరారు.

ఎయిర్పోర్ట్ అంశంలో సర్వే జరుగుతున్నప్పటికీ తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర అయోమయ స్థితి తోపాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. అధికారులు తమతో సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. నష్టపోతున్న వారికి ఎకరానికి 6 కోట్లు, ఉపాధి అవకాశాలు, ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story