Adilabad: 'మా ఉపాధ్యాయుడు మాకే కావాలి': డోప్టాలలో విద్యార్థుల ధర్నా!
Adilabad: మా ఉపాధ్యాయుడు మాకే కావాలి.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం డోప్టాల పాఠశాల గేటు వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా. టీచర్ అంకుష్ బదిలీని రద్దు చేయాలని డిమాండ్.
Adilabad: 'మా ఉపాధ్యాయుడు మాకే కావాలి': డోప్టాలలో విద్యార్థుల ధర్నా!
అదిలాబాద్: మా ఉపాధ్యాయుడు మాకే కావాలి’ అంటూ విద్యార్థుల నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు అదిలాబాద్ జిల్లాలో..బేల మండలం డోప్టాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంకుష్‌ను చప్రాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాత్కాలికంగా బదిలీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం డోప్టాల ప్రాథమిక పాఠశాల గేటు ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘మా ఉపాధ్యాయుడు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోషకుడు అనిల్ మాట్లాడుతూ.. అంకుష్ సర్ బోధనతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని తెలిపారు.
ప్రస్తుతం ఆయనను బదిలీ చేస్తే తమ పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. అంకుష్‌ను తిరిగి డోప్టాల ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో తమ పిల్లలను తిరిగి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సి వస్తుందని తల్లిదండ్రులు తెలిపారు.
విద్యార్థిని అద్విత మాట్లాడుతూ ప్రైవెట్ పాఠశాలకు వెళ్లే మాకు ఇక్కడ ఉపాధ్యాయుడు మంచిగా చెబుతున్నాడని ఈ పాఠాశాలకు వస్తే ఆ సార్ నే తీసేస్తామంటే మేము ఎవరం ఈ పాఠశాలలో ఉండమని, మరో ఉపాధ్యాయున్ని పంపుతామంటున్నారని కానీ ఆ ఉపాధ్యాయుడు మాకొద్దని వస్తే మేము వెళ్లి పోతామన్నారు.




