Adilabad: ఆదిలాబాద్లో బ్రాహ్మణ భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు!
Adilabad: ఆదిలాబాద్ తిరుపెల్లి రామాలయ ప్రాంగణంలో రూ.2 కోట్లతో నిర్మించిన బ్రాహ్మణ సమాజ్ భవనాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.
Adilabad: ఆదిలాబాద్లో బ్రాహ్మణ భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుపెల్లి ప్రాంతంలోగల రామాలయ ప్రాంగణంలో సుమారు రూ. 2 కోట్ల తో నూతనంగా నిర్మించిన భవనాన్ని నిర్మించారు. రామాలయానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు కి వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం సభ్యులు పూర్ణకుంభం తో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి మంత్రితో పాటుగా విచ్చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేదం బొజ్జు, MP గోడం నగేష్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ MLC పురాణం సతీష్, స్థానిక మున్సిపల్ చైర్మెన్ బండారి అనూష సతీష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మున్సిపల్ కౌన్సిలర్ల, నాయకులు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, mla, MP, ముఖ్యనాయకులు. జ్యోతీ ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను రిబ్బన్ కట్ చేసి, అందులోనే రెండవ అంతస్తుకు చేరుకున్న మంత్రి, Mla లు, MP. నూతన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందటం అర్హులైన ప్రతిఒక్కరి హక్కు అని, వాటిని అర్హులకు అందజేయటం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. తమ ప్రభుత్వం అన్నివర్గాలవారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తనవంతుగా షాయాశక్తులా సహకరిస్తానని అన్నారు.
Mla పాయల శంకర్ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు అందరిలోకీ ప్రత్యేకమని. అందరి మేలు కోరేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే అన్నారు.. వారితో నాకు ప్రత్యేక అనుబంధముందని, బ్రాహ్మణుల కు ప్రభుత్వ పరంగా ఎప్పుడు, ఎలాంటి సహకారమైనా అందించటానికి తాను సిద్ధమేనన్నారు. MP గోడం నగేష్ మాట్లాడుతూ.. ఈ భవన్ నిర్మాణానికి గతం లో తాను MP నిధుల నుండి కొన్ని నిధులు కేకాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో మరిన్ని నిధులను సైతం అందించేందుకు సంసిద్ధత తెలిపారు.
మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, మాజీ MLC పురాణం సతీష్ లు మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు తాము ఎల్లపుడు అందుబాటులో ఉంటామని, వారికి అవసరమైన ఎలాంటి సహకారమైనా అందించేందుకు ముందుతామన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ బ్రాహ్మణ్ సమాజ్, వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు శాలువాలతో సత్కరించారు. అన్ని హంగులతో చక్కటి భవనాన్ని నిర్మించుకున్న ఆదిలాబాద్ బ్రాహ్మణ్ సమాజ్ ను మంత్రితో పాటుగా వేదికపైనున్న అతిథులందరూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ్ సమాజ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అన్నోజుల సంతోష్, విశ్వాస్ నిర్మల్కర్, వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘు జోషి, దూబే శ్రీకాంత్ శర్మ, కోశాధికారి అరుణ్ శాస్త్రి, రామాలయ ప్రధానార్చకులు విద్యాసాగర్, గాయత్రి మహిళామండలి అధ్యక్షురాలు సోనాలి జోషి, బ్రాహ్మణ మిత్రమండలి, బ్రాహ్మణ ప్రైవేటు ఉద్యోగ వ్యాపార సంఘాల సభ్యులు, సమాజ్ సీనియర్లు తదితరులు పాల్గొన్నారు.




