Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ప్రవక్త నామస్మరణతో భారీ ర్యాలీ, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Aug 2026 12:29 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు!

Adilabad: మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నారే తక్బీర్.. అల్లహు అక్బర్ అంటూ మహమ్మద్ ప్రవక్త నామస్మరణతో ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు చేపట్టిన సామూహిక ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు సాగింది. అక్కడ మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు, వారి మార్గదర్శకాలను వినిపించారు. ఆయన చూపిన సన్మార్గాన్ని ఆచరించాలని సూచించారు. భారీ ర్యాలీ నేపథ్యంలో బందోబస్తును ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story