Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ధర్నా. నూతన టెండర్లు పిలిచి జీవో 60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 16 Sept 2026 10:36 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ!

Adilabad: ఆదిలాబాద్ లోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. రిమ్స్ లో నూతన టెండర్లను పిలిచి కార్మికులకు కనీస వేతన అమలు చేయాలని డిమాండ్ చేస్తే బుధవారం ధర్నా చేపట్టారు. పాత టెండర్లు కాలపరిమితి ముగిసినప్పటికీ ఇప్పటివరకు నూతన టెండర్లను పిలవడం లేదన్నారు. వేతనాలు తీసుకొని దాంట్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

కార్మికుల సమస్యలపై చర్చించడానికి కాంట్రాక్టర్లు యూనియన్లతో జాయింట్ మీటింగ్ పెట్టాలని పేర్కొన్నారు. కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వడంతో పాటు రిటర్మెంట్ బెనిఫిట్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.