Adilabad: ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగవంతం చేయాలి

Adilabad: అదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 Oct 2026 11:05 PM IST
Adilabad
X

Adilabad: ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగవంతం చేయాలి

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత నూతన పారిశ్రామిక పార్కు (ఇండస్ట్రియల్ పార్క్) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో బోరజ్ మండలంలోని గిమ్మ, రాంపూర్, గూడ గ్రామాల రైతులు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుండి న్యాయమైన రీతిలో పరిహారం, పునరావాస చర్యలు అందజేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావ్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, ఆయా మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.