Adilabad: మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం.. జిల్లా కలెక్టర్

Adilabad: మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 23 Jun 2026 7:25 PM IST
Adilabad
X

Adilabad: మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం.. జిల్లా కలెక్టర్

Adilabad: ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మామిడిగూడ గ్రామంలో నూతనంగా విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే గ్రామాల పరిధిలో అన్ని వసతులతో కూడిన సంఘ భవనాల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. మామిడిగూడ గ్రామంలో నిర్మించనున్న ఈ వివో బిల్డింగ్ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మహిళా సంఘాల ప్రతినిధులు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. గ్రామీణ మహిళలు సంఘాల ద్వారా పొందుతున్న ప్రభుత్వ పథకాలను, రుణా అవసరాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల బలోపేతానికి, వారి ఆర్థిక స్వాలంబనకు ఈ వివో భవనాలు ఎంతగానో దోహదపడతాయని, మహిళలు ఒకే చోట సమావేశమై తమ సంఘాల పురోగతిపై చర్చించుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ భవనం ఒక వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story