Adilabad: వ్యసన రహిత సమాజంతోనే తెలంగాణ రైజింగ్ కలెక్టర్
Adilabad: ఆదిలాబాద్ బ్రహ్మకుమారీస్ నిలయంలో నశా ముక్త్ భారత్ అభియాన్. పాల్గొని ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
Adilabad: వ్యసన రహిత సమాజంతోనే తెలంగాణ రైజింగ్ కలెక్టర్
ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన యువతే తెలంగాణ రైజింగ్, వికసిత్ భారత్‌కు అసలైన బలమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.. ఆదిలాబాద్‌లోని బ్రహ్మకుమారీస్ నిలయంలో బ్రహ్మకుమారీస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 'నశా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ చేపట్టిన 10 కోట్ల మంది వ్యసనముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలంటే కేవలం గంజాయి, కొకైన్ మాత్రమే కాదని, మద్యం, పొగాకు, జర్దా వంటి చిన్న అలవాట్లు కూడా తీవ్ర వ్యసనాలుగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మొబైల్ ఫోన్ల అతిగా వాడకం వంటి డిజిటల్ వ్యసనాలు కూడా యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ పేర్కొన్న సామాజిక పాపాలను గుర్తు చేస్తూ.. విద్యతో పాటు విలువలు, వ్యక్తిత్వ వికాసం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. విద్యార్థులు ఉదయాన్నే లేవడం, యోగా, ధ్యానం వంటి మంచి దినచర్యలను అలవర్చుకోవాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యసన విముక్తిపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం రానున్న 15 రోజుల పాటు విస్తృతంగా కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, వ్యసనాలకు దూరంగా ఉండటమే ఆరోగ్యవంతమైన జీవితానికి పునాది అని అన్న




