Adilabad: ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా!

Adilabad: ఆదిలాబాద్ పట్టణం నీలా నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన పసుపుల రాజు నూతన గృహాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Nov 2026 11:33 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా!

ఆదిలాబాద్: ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదిలాబాద్ పట్టణంలోని నీలా నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన పసుపుల రాజు నూతన గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నూతన గృహాన్ని పరిశీలించి, ఇంటి నిర్మాణ నాణ్యత, కల్పించిన వసతులను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని చక్కటి గృహాన్ని నిర్మించుకున్న లబ్ధిదారుడిని అభినందించారు.

జిల్లాలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు పసుపుల రాజు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు.

తమ కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, సహకరించిన జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, హౌసింగ్ ఈఈ నాసిర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.