Adilabad: గుంజాలలో వాటర్‌షెడ్ పనులను ప్రారంభించిన కలెక్టర్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాలలో నాబార్డ్ సహకారంతో చేపట్టిన వాటర్‌షెడ్ పనులను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించి పలు సూచనలు చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 Aug 2026 4:48 PM IST
Adilabad
X

Adilabad: గుంజాలలో వాటర్‌షెడ్ పనులను ప్రారంభించిన కలెక్టర్!

ఆదిలాబాద్: భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ, అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కార్యక్రమానికి ముందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్ నిర్వహణను పరిశీలించి అభినందించిన కలెక్టర్, అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్కనాటి నీరు పోశారు. ఈ మొక్కకు గ్రామస్తులు కలెక్టర్ పేరుతో నామకరణం చేశారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ముసాయిదా ఓటరు జాబితా, ఏఎస్‌డీ జాబితాలను బిఎల్ఓ లక్ష్మీ చదివి వినిపించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గుంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశలవారీగా విస్తరించబడుతుందని తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు రెండు పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్ (GPS, GIS) పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందని స్పష్టం చేశారు.

అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కొరకు 1 కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్‌మెంట్ చార్జీలు లేకుండా కేవలం రూ.9,150/- చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story