Adilabad: కరంజి రహదారి పనుల పరిశీలన నాణ్యతలో రాజీ పడొద్దన్న కలెక్టర్!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి రహదారి అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Adilabad: కరంజి రహదారి పనుల పరిశీలన నాణ్యతలో రాజీ పడొద్దన్న కలెక్టర్!
Adilabad: అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి రహదారి పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు...18 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న ఈ రోడ్డు పనుల నాణ్యత ప్రమాణాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు...
18 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రూ.5 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం రూ.3 కోట్ల వ్యయంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారిని పునర్నిర్మిస్తున్న పనులను ఆయన పరిశీలించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రహదారి పనుల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి, త్వరితగతిన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు.




