Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్‌లో దసరా సంబరాలు
Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్‌లో ఘనంగా దసరా వేడుకలు. జమ్మి పూజ నిర్వహించి రావణ దహనం చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే.
Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్‌లో దసరా సంబరాలు
ఆదిలాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని దస్నాపూర్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ముఖ్యఅతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు అతిథులు పూజ కార్యక్రమాలు నిర్వహించి, ఎస్పీ, కలెక్టర్ రావణ దహనం చేశారు. అనంతరం వివిధ గణేష్ మండపాల నిర్వాహకులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




