Ichod: ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్!
Ichod: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. సరైన పత్రాలు లేని వాహనాల గుర్తింపు, ఈ-చలాన్ల వసూలు.
Ichod: ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్!
Ichod: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్ హెచ్ ఓ ఇన్స్పెక్టర్ వి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే గ్రామంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సెర్చ్ తరహా తనిఖీల్లో సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పెండింగ్ ఈ-చలాన్లను తనిఖీ చేయగా, 85 కేసులకు సంబంధించి వాహనదారులు రూ. 16,570 జరిమానాను అక్కడికక్కడే చెల్లించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడంతో పాటు వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవిరుద్ధ పనులకు పాల్పడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విష్ణు ప్రకాష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




