Gudihatnur: గుడిహత్నూర్ లో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం
Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ శివాలయంలో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం. ఆగస్టు 15లోగా మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని డీసీసీ పిలుపు.
Gudihatnur: గుడిహత్నూర్ లో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం
గుడిహత్నూర్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్ శివాలయ కల్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపు రావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్లతో కలసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. వర్గ విభేదాలకు తావులేకుండా, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా నూతన మండల కమిటీలను నియమించాలని పిలుపునిచ్చారు.
ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో సహా 21 మంది సభ్యులు ఉండాలని, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సీనియర్ నాయకుల అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు ప్రతి మండలంలో 'పొలిటికల్ అఫైర్స్ కమిటీ' (PAC) ని ఏర్పాటు చేయాలని, జిల్లాలోని అన్ని మండల, బూత్ స్థాయి కమిటీల నియామక ప్రక్రియను ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు అధిష్టానం తగిన గౌరవం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తొడసం దౌలత్ రావు, సర్పంచ్ ఆడే శీల, సీనియర్ నాయకులు నాగనాథ్ అప్ప, కరుణాకర్, యువ నాయకులు ఆడే జైపాల్, శ్రీకర్ గౌడ్, చెట్ల మహేందర్, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




