Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ ఘనంగా నిర్వహణ
Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ భవనానికి మాజీ మంత్రి సిఆర్ఆర్ (సి. రామచంద్రారెడ్డి) పేరు నామకరణం చేశారు.
Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ ఘనంగా నిర్వహణ
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యాలయం కేవలం పార్టీ నేతలకు కాకుండా.. ప్రజాసేవ భవన్ గా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో గాను ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి సిఆర్ఆర్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్, బాలూరి గోవర్ధన్ రెడ్డి, గోలి సంజయ్, బెజ్జంకి అనిల్ కుమార్, కిజర్ పాషా, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.




