Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్, నాయకులు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, ఎస్సీ సెల్ పార్లమెంట్ ఇంచార్జ్ దుర్గం శేఖర్, తదితరులున్నారు.




