Adilabad: పర్యాటక రంగ అభివృద్ధిలో ఆదిలాబాద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు!

Adilabad: పర్యాటక అభివృద్ధిలో ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు కలెక్టర్ రాజర్షి షాకు అధికారుల అభినందనలు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Sept 2026 10:53 PM IST
Adilabad
X

Adilabad: పర్యాటక రంగ అభివృద్ధిలో ఆదిలాబాద్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ పురస్కారాన్ని అందజేశారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా నాయకత్వం, మార్గదర్శకత్వంలో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపడుతున్న చర్యలకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని పర్యాటకులకు మరింత చేరువ చేయడం, మౌలిక సదుపాయాలు, పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరచడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపడుతోంది.

జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచనలు, పర్యవేక్షణతో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పురస్కారం జిల్లా పర్యాటక శాఖతో పాటు జిల్లా యంత్రాంగం సమష్టి కృషికి లభించిన గుర్తింపుగా ఆయన తెలిపారు. పురస్కారం లభించిన సందర్భంగా జిల్లా పర్యాటక అధికారి రవికుమార్ మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి అభినందనలు తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.