Adilabad: నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 27 April 2026 6:58 PM IST
Adilabad
X

Adilabad: నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్.. 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత!

Adilabad: రోజు రోజుకు కు పెరుగుతున్న ఎండలతో అదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. 45.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత సరా సరిగా నమోదు అవుతుంది.. జిల్లాలోని బేల, భీంపూర్, తాంసి, నేరేడుగొండ తదితర మండలాలతో పాటు చాలా గ్రామాల్లో 45 డిగ్రీలకు పైగానే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు 43 డిగ్రీలు గా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు,

అకస్మాత్తుగా తిరగడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఉదయం 9 దాటితే చాలు ప్రజలంతా సాయంత్రం ఐదు గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోతుండగా, మరో రెండు మూడు రోజుల పాటు కూడా టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొంటూ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story