Adilabad: అదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Adilabad: పత్తి కొనుగోళ్ల ప్రారంభంలోనే సమన్వయ లోపం ఉందని, రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 30 Sept 2026 5:13 PM IST
Adilabad
X

Adilabad: అదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

అదిలాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే హాజరుకాకపోవడం రైతు సమస్యలపై వారికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.పత్తి కొనుగోళ్ల ప్రారంభ దశలోనే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని జోగు రామన్న అన్నారు.

రైతుల పంట కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.