Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల మాఫియా గుట్టురట్టు.. ఎస్పీ అఖిల్ మహాజన్ సంచలన ప్రకటన
Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ జనన ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠాను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 280 నకిలీ డిజిటల్ పత్రాలు స్వాధీనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన.
Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల మాఫియా గుట్టురట్టు.. ఎస్పీ అఖిల్ మహాజన్ సంచలన ప్రకటన
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం లోని దస్నాపూర్ రోడ్డులో యూనియన్ బ్యాంక్ సమీపంలో నకిలీ జనన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారనే సమాచారంపై మావల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ ఎ. జగదీశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించగా, ఒక వ్యక్తి సమర్పించిన జనన ధృవీకరణ పత్రం మున్సిపల్ కార్యాలయ రికార్డుల్లో లేకపోవడంతో మోసం వెలుగులోకి జిల్లా ఎస్పీ అఖిల్ మహదేవన్ తెలిపారు.. విచారణలో భాగంగా మావల ఇన్స్పెక్టర్ కె. స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి మే 7న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో ఓసా రవికుమార్ ,షేక్ అమీర్, అబ్దుల్ ముజాహిద్,అబ్దుల్ తన్వీర్, అడపా సంతోష్ ను అరెస్టు కాగామరో నిందితుడు జునైద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మొబైల్ ఫోన్లు మరియు PDF ఎడిటింగ్ యాప్స్ ఉపయోగించి నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల్లో మార్పులు చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ పథకాలు పొందేలా చేస్తామని నమ్మబలికి ఒక్కో పత్రానికి రూ.1500 నుండి రూ.3000 వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 280కు పైగా డిజిటల్ పత్రాలు ఉన్న మొబైల్ ఫోన్లు, నకిలీ ఓటర్ కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. జనన ధృవీకరణ పత్రాలు వంటి ప్రభుత్వ పత్రాలను కేవలం మున్సిపల్ కార్యాలయం లేదా అధికారిక మీ సేవా కేంద్రాల ద్వారానే పొందాలని సూచించారు. అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని త్వరగా పత్రాలు తయారు చేస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని తెలిపారు ఎస్ పి అఖిల్ మహజాన్.




