Adilabad: ఆదిలాబాద్ డైట్ మైదానంలో వైభవంగా రావణ దహన వేడుకలు

Adilabad: ఆదిలాబాద్ డైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వైభవంగా రావణ దహనం. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి హాజరు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Oct 2026 11:09 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ డైట్ మైదానంలో వైభవంగా రావణ దహన వేడుకలు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని డైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను వైభవంగా నిర్వహించారు.

పండుగ సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. రావణ దహనాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రవాణా దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రమోద్ కత్రి, కే రవీందర్, డి.ఎస్.పి జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.