Adilabad: పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద దేశీదారు పట్టివేత బైక్ స్వాధీనం
Adilabad: ఆదిలాబాద్ జిల్లా పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ తనిఖీల్లో అక్రమ దేశీదారు పట్టుబడింది. బైక్‌తో పాటు 85 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
Adilabad: పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద దేశీదారు పట్టివేత బైక్ స్వాధీనం
దేశి దారు పట్టివేత...
ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా మండలంలోని పౌజ్ పూర్ కు చెందిన తోట స్వామి తన ద్విచక్ర వాహనంపై దేశిదారు మద్యం బాటిల్లను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రెండ్ల విజేందర్ తెలిపారు. అతని నుండి 85 దేశిదారు బాటిళ్లు స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ: 3400 వేలు ఉంటుందని పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా దేశిదారు మద్యం రవాణా, విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు.
Next Story




