Adilabad: ఘరానా సైబర్ మోసగాడి అరెస్ట్ - రూ.95 లక్షలు స్వాహా
Adilabad: అదిలాబాద్‌లో సైబర్ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, గోవా, తెలంగాణలో రూ.95 లక్షల వరకు మోసం చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Adilabad: ఘరానా సైబర్ మోసగాడి అరెస్ట్ - రూ.95 లక్షలు స్వాహా
ఆదిలాబాద్: బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు అదిలాబాద్ పోలీసులు.. జిల్లా ఎస్పీ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, గోవా తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 150 సైబర్ మోసానికి పాల్పడిన ఫిర్యాదులు ఉన్నాయని ,మూడు రాష్ట్రాల బాధితుల వద్ద 95 లక్షల వరకు మోసానికి పాల్పడినట్లు, మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.. నిందితుడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నామని, మహారాష్ట్రలోని ఆకులకు చెందిన నిందితుడు చైతన్య
బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు మరియు OTPలు సేకరించి డబ్బులు కాజేస్తు మోసాలకు పాల్పడినట్లు,ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన బాధితుడు ప్రఫుల్ పాటిల్కు 2026 జూలై నెలలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, అతని క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించి సైబర్ మోసానికి పాల్పడి రూ.73,279/- కాదేశాలని బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు
.దర్యాప్తులో భాగంగా NCRP పోర్టల్ ద్వారా లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని తెలిపారు..పోలీసుల విచారణలో నిందితుడు తాను గతంలో Axis బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో కస్టమర్లతో మాట్లాడిన అనుభవాన్ని ఉపయోగించుకుని, బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన మొబైల్ నంబర్లను సేకరించినట్లు తెలిపాడు. అనంతరం వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బ్యాంక్ అధికారులమంటూ కస్టమర్లకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు OTPలను తెలుసుకుని డబ్బులను వివిధ UPI, Amazon ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు తెలిపాడు.
నిందితడు తెలంగాణ, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో దాదాపు 150 మంది బాధితుల వద్ద రూ 95,33,651/- నగదు నష్టపోయినట్లు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నందు ఫిర్యాదులను నమోదు అయినట్లు తెలిపారు.
అదేవిధంగా 23.07.2026న బాధితుడికి HDFC బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నమ్మించి, OTPలను తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా మొత్తం రూ.73,279/- బదిలీ చేసుకున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు మోసాలకు ఉపయోగించినట్లు తెలిపిన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడించాడు. అలాగే వివిధ మొబైల్ నంబర్లతో సిమ్ కార్డులు మార్చుతూ, మొబైల్ ఫోన్లు మార్చుతూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు...సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు... ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్ కుమార్ ఉన్నారు...




