Adilabad: పోలీసులకు కత్తి చూపించి పరార్.. చోరుల గుట్టు రట్టు!
Adilabad: పాటు పలు జిల్లాల్లో వాహన చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 10 మందిని అరెస్ట్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Adilabad: పోలీసులకు కత్తి చూపించి పరార్.. చోరుల గుట్టు రట్టు!: పోలీసులకు కత్తి చూపించి పరార్.. చోరుల గుట్టు రట్టు!
అదిలాబాద్ జిల్లా: పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాహనాల దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.. గత రెండు రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేస్తున్న నేరడిగొండ పోలీసులను కత్తి చూపించి కారులో పరారైన వారిని పట్టుకునే ప్రయత్నంలోజిల్లాలో తనఖీ నిర్వహించగా వాహన దొంగతనాలకు పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.16 మంది నిందితులపై కేసు నమోదుకాగా.. పది మందిని అరెస్టు చేశామని, ఆరుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారు దొంగిలించిన 7 మోటార్ సైకిల్స్, 3 ఆటోలు, 1 కారు, ఒక కత్తి, 8 సెల్ ఫోన్స్, 1500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
గత కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలలో నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠాను జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు...




