Adilabad: ముంపు పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న!
Adilabad: జైనథ్, బేల మండలాల్లో పెనుగంగా నదీ ముంపు ప్రాంతాలను పరిశీలించిన జోగు రామన్న. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్.
Adilabad: ముంపు పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జోగు రామన్న!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పెనుగంగా నదీ పరివాహ ముంపు ప్రాంతాలను పరిశీలించారు మాజీ మంత్రి జోగు రామన్న.. జిల్లాలోని జైనథ్, బేల మండలంలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెదోడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కూడా దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏడాది అతివృష్టి కారణంగా పెన్‌గంగా పరీవాహక ప్రాంతంలో 20 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత మూడు నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు పూర్తిగా నీటమునిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బాధిత రైతులను పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటివరకు నష్టపోయిన పంటలపై కేంద్ర బృందాలు సర్వేలు నిర్వహించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున అందించగా, ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి, నేడు ఆ హామీని నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుందని ఎన్నికల ముందు ప్రకటించి, ఇప్పుడు అదే రైతులను మోసం చేయడం జరిగిందన్నారు.
నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో నష్టప




