Adilabad: విద్యాసంస్థల బంద్: వామపక్ష విద్యార్థి నేతల అరెస్ట్!

Adilabad: శుక్రవారం విద్యాసంస్థల బంద్ సందర్భంగా ఉద్రిక్తత. స్కూళ్లను మూసివేయించేందుకు యత్నించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 10 July 2026 10:40 AM IST
Adilabad
X

Adilabad: విద్యాసంస్థల బంద్: వామపక్ష విద్యార్థి నేతల అరెస్ట్!

Adilabad: ఆదిలాబాద్ లో శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగారు. అనంతరం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న తమను అడ్డుకోవడం సరికాదని నేతలు పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story