Gudihatnoor: జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన లారీ సోలార్ పోల్స్ ధ్వంసం
Gudihatnoor: గుడిహత్నూర్ వద్ద ఎన్‌హెచ్-44పై టమాటాల లారీ అదుపుతప్పి సోలార్ పోల్స్‌ను ఢీకొట్టింది. రూ. 5.62 లక్షల ఆస్తి నష్టం జరగడంతో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Gudihatnoor: జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన లారీ సోలార్ పోల్స్ ధ్వంసం
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా NH-44 జాతీయ రహదారిపై మెకలగండి-గుడిహత్నూర్ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు టమాటాల లోడుతో వెళ్తున్న లారీ (AP 39 U 7488) అతివేగం, అజాగ్రత్త కారణంగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పై ఉన్న రెండు సోలార్ వీధి దీపాల స్తంభాలను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుమారు రూ. 5,62,800 విలువైన రెండు సోలార్ పోల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పిప్పల్‌వాడ టోల్ ప్లాజా పీఆర్వో రాథోడ్ కేసర్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుడిహత్నూర్ ఎస్సై L.శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




