Adilabad: ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
Adilabad: ఆదిలాబాద్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు కార్యకర్తలు గ్రామాల్లో ఉండాలని పిలుపు.
Adilabad: ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తమ గ్రామాలలో ఉంటూ పర్యవేక్షించాలని సూచించారు. ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మరోసారి రేవంత్ రెడ్డి సీఎం చేయడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయడం కోసం తమ జన్మదిన వేడుకలను కూడా జరుపుకోవడం లేదని తెలిపారు.
Next Story




