Adilabad: కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడిని తొలగించండి: ఎమ్మెల్యే పాయల్
Adilabad: వినియోగదారుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆదిలాబాద్ కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడు
Adilabad: కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడిని తొలగించండి: ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్: వినియోగదారుల సమస్యలు పరిష్కరించాల్సిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు, సభ్యులు ప్రజలకు ఇబ్బందులు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడి తోపాటు ఇద్దరి సభ్యులను తొలగించాలనే
డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రీలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ...
వినియోగదారుడి సమస్య పరిష్కరం పని చేయాల్సిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు
ఏకపక్షంగా.. న్యాయవాదులను అవమాన పరిచేలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పుడు ఇప్పుడే మహిళలు న్యాయవాద వృత్తికి వస్తుంటే ఫోరం అధ్యక్షుడు వారు
వంటింకే పరిమితం కావాలనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయి కోర్టును ఆశ్రయిస్తే కార్పొరేట్ కంపెనీలకు అనుకులంగా
తీర్పులు ఇస్తున్నారని తెలిపారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడితో పాటు ఇద్దరు సభ్యులను తొలగించాలని చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం జరుగుతుందన్నారు.




