Adilabad: ఘనంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు
Adilabad: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన శ్రేణులు.
Adilabad: ఘనంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్: బీజీఎల్పి ఉపనేత , ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి భారీ కేకును ఎమ్మెల్యే కట్ చేశారు.
అనంతరం మెగా రక్తదానం శిబిరం నిర్వహించగా.. పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్త దానం చేసి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తన మొదటి లక్ష్యం అని పేర్కొన్నారు. త్వరలో ఎయిర్ పోర్టుతో పాటు ఇండస్ట్రియల్ పార్క్, మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని వివరించారు.
Next Story




