Adilabad: లక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల శంకర్
Adilabad: కాలుష్య నివారణ కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన 6 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రారంభించారు.
Adilabad: లక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల శంకర్
ఆదిలాబాద్: డీజిల్ పెట్రోల్ వాహనాల వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందనే ఆలోచనతో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులు 95 లక్షలతో ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణకు ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోళు చేశారు. ఆదివారం ఆ వాహనాలను చైర్పర్సన్ అనూషతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే స్వయంగా వాహనం నడపగా వైస్ చైర్మెన్ మహ్మద్ రోహిత్ జెండా ఊపి వాహనాలను సాగనంపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకవైపు పెట్రోల్, డీజిల్ వాహనాలతో వచ్చే కాలుష్యాన్ని అరికట్టడం మరోవైపు కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకువచ్చామన్నారు.
భవిష్యత్తులో పట్టణంలోని 49 వార్డులకు ఒకొక్క వార్డుకు ఒక వాహనం కేటాయించేలా సీఎస్ఆర్ నిధులు లేదా మున్సిపల్ నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణం శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.




