Adilabad: రిమ్స్ సిబ్బంది కొరతపై ఎమ్మెల్యే ఆగ్రహం

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది కొరత, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 21 April 2026 3:01 PM IST
Adilabad
X

Adilabad: రిమ్స్ సిబ్బంది కొరతపై ఎమ్మెల్యే ఆగ్రహం

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన వనరులు, సిబ్బంది, వైద్యుల కొరత కారణంగా ప్రజలకు సరైన వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ వంటి దూర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించినప్పటికీ, తగిన సిబ్బంది లేమి కారణంగా అందుబాటులో ఉన్న సదుపాయాలు పూర్తిగా వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా పరిపాలనతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది వైద్యులను నియమించినప్పటికీ, ఇంకా అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అదనంగా ఆసుపత్రిలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ (బయో వేస్ట్ మేనేజ్‌మెంట్) సరైన విధంగా లేకపోవడం పట్ల ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా బయో వేస్ట్ నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జై సింగ్ రాథోడ్ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story