Gudihathnoor: ధామన్‌గూడలో ఘనంగా దండారి గుస్సాడీ ఉత్సవాలు: పాల్గొన్న ఎంపీ

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం ధామన్‌గూడలో జరిగిన దండారి గుస్సాడీ ఉత్సవాల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH
Published on: 6 Nov 2026 2:34 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: ధామన్‌గూడలో ఘనంగా దండారి గుస్సాడీ ఉత్సవాలు: పాల్గొన్న ఎంపీ

​గుడిహత్నూర్: గిరిజనుల ఆరాధ్య సాంస్కృతిక వేడుక అయిన దండారి గుస్సాడీ ఉత్సవాలు గుడిహత్నూర్ మండలంలోని ధామన్‌గూడ గ్రామంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్‌తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

​గ్రామానికి చేరుకున్న ఎంపీ గోడం నగేష్ బృందానికి గ్రామస్తులు, ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన దండారి, గుస్సాడీ నృత్యాలు, మహిళల సంప్రదాయ గీతాలాపనలు, కోలాట విన్యాసాలను వారు ఆసక్తిగా తిలకించి కళాకారులను ఉత్సాహపరిచారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సజీవ సంస్కృతికి దండారి గుస్సాడీ ఉత్సవాలు ప్రతీకలని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి గంగాధర్ రావు, మాజీ రైల్వే బోర్డు సభ్యులు జి.వి. రమణ, ప్యాక్స్ చైర్మన్లు కదం ప్రశాంత్, వెంకన్న, బీజేపీ జిల్లా ఎస్టీ సెల్ నాయకులు జాదవ్ రమేష్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH