Adilabad: హైదరాబాద్ మోదీ సభను జయప్రదం చేయండి.. ఎంపీ నగేశ్

Adilabad: మే 10న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పిలుపునిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 5 May 2026 5:59 PM IST
Adilabad
X

Adilabad: హైదరాబాద్ మోదీ సభను జయప్రదం చేయండి.. ఎంపీ నగేశ్

Adilabad: కొత్తగూడెం.. లక్ష్మీదేవిపల్లి లోని బిజెపి జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 10న మోదీ రాష్ట్ర పర్యటన.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో సన్నాహకసమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద అడుగిడుతున్న సందర్భంగా ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ చేస్తున్న కృషిని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను, పథకాలను చేపట్టిందన్నారు. ముఖ్యంగా రైల్వే, జాతీయ రహదారులు, విద్యుత్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలకు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

సుమారు 8 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు,ఎయిమ్స్ (AIIMS), జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ పనులు, జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టుల పనులకు శంఖు స్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు.

ఈ పర్యటన తెలంగాణలో బీజేపీ పటిష్టతకు ఎంతో దోహదం చేస్తుందని, యావత్తు భారతదేశం మోడీ వైపు బీజీవైపు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మే 10న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆరు లక్షల మందితో మోడీ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

పార్టీ శ్రేణులు, మేధావులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డాక్టర్ జయచంద్రా రెడ్డి, నాయకులు జీవీకే మనోహర్ రావు, పోడియం బాలరాజు, ముసుకు శ్రీనివాసరెడ్డి జల్లారపు శ్రీనివాసరావు పొన్నం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story