Adilabad: మున్సిపల్ అధికారుల యాక్షన్.. బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు!

Adilabad: ఆదిలాబాద్ పంజాబ్ చౌక్, బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 July 2026 8:45 PM IST
Adilabad
X

Adilabad: మున్సిపల్ అధికారుల యాక్షన్.. బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు!

అదిలాబాద్: అదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కలిసి బుల్డోజర్లతో ఆక్రమణలను తొలగించారు. పంజాబ్ చౌక్, భుక్తాపూర్, ప్రధాన బస్ స్టాండ్ ఎదురుగా మరియు ఇందిరమ్మ కాలనీల్లో రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, నిర్మాణాలను అధికారులు తొలగించారు.

టౌన్ ప్లానింగ్ అధికారిణి సుమలత, టీపీఎస్ (TPS) నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పట్టణ సుందరీకరణకు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story