Adilabad: ఘనంగా కార్గిల్ దివస్.. అమరవీరుల స్థూపానికి నివాళులు!

Adilabad: ఆదిలాబాద్ కార్గిల్ పార్క్‌లో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్, అదనపు కలెక్టర్ నివాళులర్పించారు.

A. SRINIVAS, 	SHADANAGAR
Published on: 26 July 2026 11:51 AM IST
Adilabad
X

Adilabad: ఘనంగా కార్గిల్ దివస్.. అమరవీరుల స్థూపానికి నివాళులు! 

ఆదిలాబాద్: మాతృ భూమి రక్షణ కోసం శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష అన్నారు.

కార్గిల్ దివస్ ను పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని కార్గిల్ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు తో కలిసి ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి.. ఘనంగా నివాళ్ళు సమర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఎన్.సి.సి కాడేట్ లు సైతం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

అదేవిధంగా సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు సైతం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

అంతకుముందు మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖాత్రీ, మాజీ ఆర్మీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ దాస్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

A. SRINIVAS, 	SHADANAGAR

A. SRINIVAS, SHADANAGAR