Adilabad: ఆదిలాబాద్ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

Adilabad: ఆదిలాబాద్‌లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు. మున్సిపల్ జవాన్లకు ఫాగింగ్ పంపుల పంపిణీ. ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటించాలని చైర్‌పర్సన్ సూచన.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 9 July 2026 3:08 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

ఆదిలాబాద్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇందులో భాగంగా గురువారం మున్సిపల్ జవాన్లకు నూతన పంపుసెట్లను ఆమె పంపిణీ చేశారు. ఇకపై ప్రతి వార్డ్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపడతామన్నారు.

వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్లలో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల అందులోనే దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అందుకే అవసరమైన మేరకే నీటిని నిల్వ చేసుకోవాలని, పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలని సూచించారు.

డెంగ్యూ వస్తే ప్లేట్‌లెట్స్ పడిపోయి నెల రోజుల పాటు కోలుకోలేరని, కాబట్టి అనవసరమైన నీటిని నిల్వ ఉంచకుండా వెంటనే పారబోయాలని అన్నారు. వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story