Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల వినూత్న ఫ్లాష్ మాబ్.. డ్రగ్స్‌పై అవగాహన

Adilabad: ఆదిలాబాద్ వినాయక్ చౌక్‌లో పోలీసుల ఆధ్వర్యంలో చావర అకాడమీ విద్యార్థుల వినూత్న ఫ్లాష్ మాబ్. డ్రగ్స్ రహిత సమాజం కోసం డీఎస్పీ జీవన్ రెడ్డి పిలుపు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 25 Jun 2026 7:32 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల వినూత్న ఫ్లాష్ మాబ్.. డ్రగ్స్‌పై అవగాహన

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినాయక్ చౌక్‌లో వినూత్న అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపు నివ్వగా,విద్యర్థుల చైతన్య ప్రదర్శన ఆకట్టుకుంది..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని తెలిపారు.

గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. విద్యార్థులు "డ్రగ్స్‌కు నో చెప్పండి", "జీవితానికి యెస్ చెప్పండి", "గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మిద్దాం" వంటి సందేశాలతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ వినూత్న ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు నేరుగా అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా పట్టణంలోని చావర అకాడమీ పాఠశాల విద్యార్థులచే ఈ ఫ్లాష్ మాబ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మావల ఇన్స్పెక్టర్ బిడి ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ మనీష్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story