Adilabad: ఆదిలాబాద్‌లో రూ. 13 కోట్ల క్రిప్టో కరెన్సీ ముఠా గుట్టు రట్టు
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో క్రిప్టో, MLm పేరుతో సాగించిన భారీ మోసం గుట్టు రట్టు. రూ.13 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఎస్పీ అఖిల్ వెల్లడించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో రూ. 13 కోట్ల క్రిప్టో కరెన్సీ ముఠా గుట్టు రట్టు
Adilabad: క్రిప్టో కరెన్సీ పేరిట మోసాలు పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేశారు అదిలాబాద్ జిల్లా పోలీసులు... ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ వెల్లడించారు.. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు అరెస్ట్ చేయగా, పరారీలో మరో నలుగురు ఉన్నట్టు తెలిపారు.. క్రిప్టో కరెన్సీ పేరట వైజాగ్ కి చెందిన రత్నరాజు, లక్ష్మణ్ రాజు. మరో నలుగురు కలిసి ఈ ఫేకు స్కీం నడిపారని.. ఆదిలాబాద్ కు చెందిన కొంత మంది బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసులో ఆదిలాబాద్, ,నిజాంబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని,
ఐటిసి గ్లోబల్ కరెన్సీ పేరుతో ఆదిలాబాద్ జిల్లాలోనే రూ.కోటి టోకరా వేశారని తెలిపారు.. యుఎస్ డిఎక్స్, డెక్కా పేరుతో మల్టిలేవల్ మార్కెటింగ్ పేరుతో స్కామ్కు పాల్పడ్డారని, మోసలతో రూ.13కోట్ల ప్రపార్టీలు నిందితులు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేశారని తెలిపారు... బాధితులు ఇంకెవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు... బిజినెస్ సమ్మేట్ పేరిట ఆదిలాబాద్ లోనూ పలుమార్లు హోటల్స్ లో కార్యక్రమాలు నిర్వహించి కోసం ఆకర్షించే ప్రయత్నాలు తెలిపారు ఎస్పి... ఎస్పీ వెంట డిఎస్పి జీవన్ రెడ్డి, టౌన్ సీఐ సునీల్ తదితరులున్నారు...




