Adilabad: జైనథ్ పరిధిలో పేకాట డెన్‌పై పోలీసుల దాడి!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి. 5 గురు అరెస్ట్, రూ.38 వేల నగదు, వాహనాలు స్వాధీనం. ఎస్సై గౌతమ్ వెల్లడి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 13 Oct 2026 7:33 PM IST
Adilabad
X

Adilabad: జైనథ్ పరిధిలో పేకాట డెన్‌పై పోలీసుల దాడి!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోరజ్ మండలం మేడిగూడ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకోగా, మరో ముగ్గురు పోలీసులను చూసి పరారయ్యారు. మొత్తం 8 మందిపై జైనథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు. పట్టుబడిన ఐదుగురు నిందితుల నుంచి పోలీసులు రూ.38,640 నగదు, 52 పేకాట కార్డులు, ఐదు సెల్‌ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.