Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు: 150 ప్యాకెట్లు స్వాధీనం.. ఒకరు అరెస్ట్!
Adilabad: ఆదిలాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి విత్తనాలు తెచ్చి రైతులకు విక్రయిస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు: 150 ప్యాకెట్లు స్వాధీనం.. ఒకరు అరెస్ట్!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ పత్రిక సమావేశంలో వెల్లడించారు...మండల వ్యవసాయ అధికారి కాటిపెల్లి నాగేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.వ్యవసాయ, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సంయుక్త తనిఖీల్లో ఇచ్చోడ మండలం ముక్రా (బి) గ్రామానికి చెందిన నిందితుడు అడావు రవికాంత్* తన ఎర్టిగా కారు లో మౌళి 5G పేరుతో ఉన్న 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ప్రతి ప్యాకెట్‌లో 450 గ్రాముల విత్తనాలు ఉండగా, వాటికి సంబంధించిన బిల్లులు, ఇన్వాయిసులు లేదా విక్రయ అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. విచారణలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన రజత్ పటేల్ అనే వ్యక్తి వద్ద నుంచి విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు విక్రయించేందుకు ఆదిలాబాద్‌కు తీసుకొచ్చినట్లు నిందితుడు తెలిపాడు.నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తూ అమాయక రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ మాట్లాడితూ రైతులు అనుమతులు లేని వ్యక్తుల వద్ద నుండి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, తప్పనిసరిగా బిల్ మరియు ధృవీకరణ ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్.




