Adilabad: గుడిహత్నూర్: సీతగొంది కేంద్రాన్ని ఖాళీ చేయాలన్న తహశీల్దార్!

Adilabad: గుడిహత్నూర్: సీతగొంది మత్స్య పెంపకం కేంద్రం వద్ద మళ్లీ వరద ముప్పు. నివాసముంటున్న కుటుంబాన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహశీల్దార్ ఆదేశం.

NAGULA SATISH, BOATH
Published on: 30 July 2026 3:21 PM IST
Adilabad
X

Adilabad: గుడిహత్నూర్: సీతగొంది కేంద్రాన్ని ఖాళీ చేయాలన్న తహశీల్దార్!

భారీ వర్షాల హెచ్చరిక: సీతగొంది మత్స పెంపకం కేంద్రం కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన

గుడిహత్నూర్:

​ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న మత్స్య పెంపకం కేంద్రం వద్ద మళ్లీ వరద భయం నెలకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఈ ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది.

​గత ఏడాది కూడా భారీ వర్షాల తీవ్రతకు ఈ కేంద్రంలో పనిచేసే కుటుంబం వరద నీటిలో చిక్కుకోగా, అధికారులు తీవ్రంగా శ్రమించి వారిని రక్షించాల్సి వచ్చింది. ఈసారి అలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా ముందస్తు రక్షణ చర్యగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుడిహత్నూర్ తహశీల్దార్ కవిత స్థానిక కేంద్రాన్ని సందర్శించారు.

​అక్కడి పరిస్థితిని సమీక్షించిన తహశీల్దార్, నివాసముంటున్న కుటుంబాన్ని వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత స్థానాలకు తరలివెళ్లాలని సూచించారు. అధికారులు వారికి అవసరమైన సహాయక చర్యలు అందిస్తారని, వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story